- అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో స్థానిక కపిలేశ్వరపురం రోడ్డులోని ఎమ్మెల్యే ఇంటి ముందు బయట ఇచ్చిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పట్టణ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే వేగుళ్ళతోపాటు మరో 21 మంది టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలవపువ్వు సెంటర్ తదితరచోట్ల పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బంద్ పాటించాలని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు.










