Aug 29,2023 15:36

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : నవభారతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌, దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవాన్‌ రామ్‌ విగ్రహాలను మండపేట పట్టణంలోని ప్రధాన కూడళిలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నియోజవర్గ దళిత నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ ఆవరణలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పతివాడ నూక దుర్గరాణి కౌన్సిల్‌ సభ్యులకు మండపేట నియోజకవర్గ దళిత నాయకులు వేరువేరుగా వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందించిన వారిలో దళిత నాయకులు బూరిగ ఆశీర్వాదం ముమ్మిడివరపు బాపిరాజు,పలివెల సుధాకర్‌, వల్లూరి రామకృష్ణ, చండ్రమళ్ల రామకృష్ణ, దాసరి లాజర్‌, బురా చిన్న, పాలింగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.