Jul 04,2023 12:07

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : స్థానిక సంగం కాలనీలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మన్యం దొర, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి, దాని కోసమే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి అని స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్రను విద్యార్థులకు ఉపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్‌ వివరించారు. అమరవీరునికి జోహార్లు అర్పిస్తూ... విద్యార్థులతో నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,హొ తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.