ప్రజాశక్తి-కపిలేశ్వరపురం(కోనసీమ) : కపిలేశ్వరపురం మండలం నల్లూరు నుంచి రామచంద్రపరం వెళ్లే రహదారి పూర్తిగా పాడవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రహదారి పొడవున పెద్దపెద్ద గోతులు పడి నీరు చేరడంతో వాహనదారులు,బాటచారులు ,ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. వెదురుముడి నుంచి కాలేరు వరకు సుమారుగా ఆరు కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి పూర్తిగా పాడయింది . ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎటువంటి ప్రమాదాలుబారిన పడకుండా రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి వాహనదారులను ప్రమాదాల నుంచి కాపాడాలని గ్రామస్తులు ,వాహనదారులు, కోరుతున్నారు.










