Sep 14,2023 18:28

ప్రజాశక్తి-రామచంద్రపురం
కంటి వైద్యులు లలిత, సునీత పర్యవేక్షణలో జిల్లా జెడ్‌పి ఉన్నత పాఠశాల ద్రాక్షారామలో 597 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం కంటి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించారు. కిరణ్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కళ్లద్దాలు అవసరమైన విద్యార్థిని విద్యార్థులకు వారం రోజుల్లో 50 మందికి ఉచితంగా కిరణ్‌ ఆసుపత్రి సిబ్బంది అందజేస్తారని మేనేజర్‌ శివ గణేష్‌ ప్రసాద్‌లు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయిని గున్నం రాజేశ్వరి, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమన్నారాయణ, డిస్టిక్‌ సైన్స్‌ ఆఫీసర్‌ జివిఎస్‌.సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.