ప్రజాశక్తి-అమలాపురం
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ చేతుల మీదుగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంగ్రా సైకిల్ యాత్ర పోస్టర్‌ను శనివారం అమలాపురం యుటిఎఫ్ హోమ్ నందు ఆవిష్కరించారు. ఈ సైకిల్ యాత్ర సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లా అంతటా కొనసాగుతుంది అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో బాగంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచిత పంపిణీ చేయా లని, భోజన పథకం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని, అమలాపురంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టల్స్ మెస్‌చార్జీలు పెండింగ్లో ఉన్న కాస్మెటిక్ చార్జెస్ రిలీజ్‌చేయాలని, రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అధ్వాన స్థితిలో ఉన్న వసతి గహాలు నిర్మించాలని, ఎన్‌ఇపి రద్దు చేయాలనీ, అలాగే ఇతర విద్యార్థి సమస్యల కోసం మాట్లాడారు. ఈ సంగ్రామ సైకిల్ యాత్రలో వచ్చిన సమస్యల పై జిల్లా కలెక్టర్‌కి విన్నపించుకుంటాం అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు మధన్ జిల్లా కమిటీ సభ్యులు శంకర్, ప్రణీత్ సాయీ, యువ, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.










