Jul 11,2023 15:07

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రామచంద్ర పురంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వార వద్ద నుంచి 22 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్నా పత్తిపాడు మండలం, బావురువాకకు చెందిన కించు అప్పారావు, పిఠాపురానికి చెందిన సంఘటాల రాజేష్‌, రామచంద్రపురం మండలం పెద్ద తాళ్లపాలెం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సత్యనారాయణ, కాకినాడలో ఉంటున్న వెల్ల గ్రామస్తుడు మర్రెడ్డి దినేశ్వరరావును, చింతపల్లి లాకులకు చెందిన వాసంశెట్టి బన్నీ అనే వ్యక్తిని మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద గల 22 కేజీలు గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పై నిఘా ఏర్పాటు చేశామని ప్రత్యేక బందాలు ఏర్పాటు చేశామని ఎస్‌పి తెలిపారు. ఎవరైనా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, మాదకద్రవ్యాలు సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.