పల్నాడు జిల్లా: 2023 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, నాబార్డు ద్వారా అమలవుతున్న అభివృద్ధి పథకాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ గురువారం సమీక్షించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో వాటర్ షెడ్ పథకాలు, మా తోట గిరిజన అభివృద్ధి పథకం, ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాలు, పొదుపు గ్రూపు మహిళలకు, యువతకు శిక్షణ తదితరాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో రైతు ఉత్పత్తిదారుల సం ఘాలు ముందుకెళ్లాలని ప్రభుత్వ పథకాలను అందిపుచ్చు కొని అభివృద్ధి చెందాలని, మార్కెటింగ్ సౌకర్యాలను సద్వి నియోగం చేసుకొని రైతు ఉత్పత్తిదాల సంఘాల్లోని ప్రతి రైతు అభివృద్ధి చెందాలని అందుకు అవసరమైన సహకారం ప్రభ్త్వ శాఖలు అందించాలని వివిధ శాఖల ప్రభుత్వ అధి కారులకు సూచించారు. సి సి ఆర్ సి కార్డులు రైతులకు అందించే దానిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చొరవ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నాబార్డు ద్వారా అమలు జరుగుతున్నటువంటి వాటర్షెడ్ పధకం మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాల కు సంబంధించి మండల స్థాయిలో పథకాల అమలు చేసే సంస్థల ప్రతినిధులు మరియు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిపి ప్రతినెల రెండవ మంగళవారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారు వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతోటి మాట్లా డుతూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.










