ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : నెల రోజుల పాటు జిల్లాలో జిల్లా యంత్రంగం సమన్వయంతో నిర్వహించిన జగనన్న సురక్ష పథకంతో ప్రజల సంతృప్తి స్థాయి పెంచగలిగామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. మంగళవారం స్పందన సమావేశ హాలులో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కలక్టర్ మాట్లాడుతూ.. గత నెల జూలై 1 వ తేదీ నుండి నెల రోజులు పాటు కృష్ణా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాలలో సుమారు లక్ష మంది ప్రజలు హాజరైయ్యారని ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పధకాలు 90 శాతం మందికి అందడం పట్ల వారు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. సరైన ధృవపత్రాలు లేని కారణంగా, లేక ఇతరత్రా కారణాల వల్ల అక్కడక్కడా పథకాలు పొందకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి వారి వివరాలు సేకరించి వారికి అవసరమైన పథకాలు , సేవలు అందించేందుకు చేపట్టిన కార్యక్రమమే. జగనన్న సురక్ష కార్యక్రమం అన్నారు. కృష్ణాజిల్లాలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని 508 సచివాలయాల్లో నిర్వహించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 టీములు, 32 మంది ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో 9,566 మంది వాలంటీర్లు జిల్లాలో 6 లక్షల 11 వేల 635 మంది సర్వే చేయవలసిన కుటుంబాలు ఉండగా, సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 5 లక్షల 47 వేల 947 మంది కుటుంబాల వద్దకు వాలంటీర్లు స్వయంగా వెళ్లి వివరాలు సేకరించారన్నారు. దీని ప్రకారం సర్వే శాతం 89.59 ఉందని, వాలంటీర్ల సర్వేలో నమోదైన మొత్తం సేవల సంఖ్య 2 లక్షల 30 వేల 900 అని కలెక్టర్ తెలిపారు. అలాగే కృష్ణాజిల్లాలో సచివాలయాలందు నమోదైన టోకెన్ల సంఖ్య 2 లక్షల 57 వేల 931 అని అందులో ఆమోదించబడినవి 2 లక్షల 51 వేల 983 అని కలెక్టర్ తెలిపారు. గతంలో ఏదైనా సర్టిఫికెట్ల కోసం వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేవారని ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని ప్రభుత్వమే ఇంటింటికి అధికారులను, వాలంటీర్లను పంపించి ఏ కుటుంబమైనా అర్హత వుండి ఇంకనూ సంక్షేమ పధకాలు పొందని వారిని గుర్తించి వారికి ఉచితంగా 11 ప్రభుత్వ ధరఖాస్తులను నేరుగా అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రముఖమైన 20 రకాల సేవలు అందించడం జరిగిందన్నారు. వాటిలో ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువపత్రాలు 1,19,916, ఆదాయ ధ్రువ పత్రాలు 98,269, ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అప్డేట్ 15,033, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ యొక్క పున్ణ జారీ 8,140,ఆదాయం సర్టిఫికేట్ పున్ణ జారీ 5,713, రైస్ కార్డ్ నందు సభ్యుని చేర్చుట 1037, కంప్యూటరైజ్డ్ డంగల్ ధృవపత్రం 543, కొత్త రైస్ కార్డ్ 437, ఆర్ ఓ ఆర్ 1 బి ధృవపత్రం437, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం 412, రైస్ కార్డు విభజించడం 403, వివాహ సందర్భ కారణపు కుటుంబ సభ్యుల విభజన 396, పంట సాగుదారు హక్కుల కార్డు 191, వ్యవసాయ భూములకు నీటి పన్ను చెల్లింపు రెవెన్యూ 74, రైస్ కార్డ్‌లో సభ్యుని తొలగించుట 71, ఒంటరి కుటుంబ సభ్యుల విభజన 62,గ్రామీణ ప్రాంతపు వివాహ ధవీకరణ పత్రం 50, ఆస్తి ఆదాయపు ధ్రువపత్రం 48, కొత్త వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ 34, ఓబీసీ ధృవపత్రం 29 ఆమోదింపబడినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించిన అధికారులకు, సహకరించిన ప్రజా ప్రతినిధులకు, సచివాలయ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమమునకు హాజరైన ప్రజలకు, పత్రికా విలేఖరులు, ప్రింట్ మీడియా ప్రతినిధులకు కృష్ణాజిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నమన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, డిఎల్ డిఓ సుబ్బారావులు పాల్గొన్నారు.










