Oct 30,2023 21:29

ఇంటింటా 'పొంగూరు' ప్రచారం

ప్రజాశక్తి -నెల్లూరు అర్బన్‌ :నెల్లూరు నగరంలోని 6వ డివిజన్‌ లోని స్టోన్‌ హౌస్‌పేట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి పొంగూరు నారాయణ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ డివిజన్‌లోని షాపులు, ఇంటింటికి తిరిగి ప్రజలను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ 2024లో టిడిపి గెలుపునకు సహకరించాలని కోరారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు.