Nov 04,2023 19:53

ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం 14, 17 వార్డుల పరిధిలోని తూర్పు వడ్డెపాలెం ప్రాంతంలో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి శనివారం బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మినీ మేనిఫెస్టోలోని పథకాలను నాగేశ్వరరావు ఇంటింటా ప్రజలకు వివరించారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్‌ రెడ్డి చెప్పినవన్నీ పచ్చిఅబద్ధాలేనన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌, సిపిఎస్‌ రద్దు లాంటి హామీలన్నీ గాలికి వదిలేసారని విమర్శించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు దివి శ్రీనివాసులు, పార్టీ నాయకులు గుమ్మడి బ్రహ్మయ్య, నాయకులు గల్లా రమణయ్య, కాకుమాని శ్రీనివాసులు, కుంచాల సురేష్‌, కత్తి జయరాం ఉన్నారు.