ఇంటి దగ్గరికే సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - ఆత్మకూరు
సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని 12వ వార్డులో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సురక్ష పథకం ద్వారా 11 రకాల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ ఆసియా, వైస్ చైర్మన్ రాజగోపాల్, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు, వైయస్‌ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్, తదితరులు పాల్గొన్నారు. డోన్ : డోన్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే సాధ్యమైందని ఎంపీపీ కమలాపురం రేగటి రాజశేఖర్ రెడ్డి, కమలాపురం గ్రామ సర్పంచ్ రేగటి. అర్జున్‌రెడ్డిలు అన్నారు. మండలంలోని కమలాపురం,ధర్మవరం గ్రామాలలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం వివిధ రకాల సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేశారు. తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపిడివో శ్రీనివాసులు, ఈఓఆర్‌డి వరప్రసాద రావు, ఎంపిడివో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సుధీర్, హౌసింగ్ ఏఈ నాగభూషణం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఈఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు. అలాగే డోన్‌లోని 15,16వ సచివాలయాల్లో నిర్వహించిన జగన్న సురక్ష క్యాంపులో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ హాజరై మాట్లాడారు. వైస్ చైర్మన్ కె హరికిషన్, కౌన్సిలర్‌లు వెంకటరాముడు, సుంకన్న, విమల, మీనాక్షి ,ఆర్ట్.రమణ, కోఆప్షన్ సభ్యులు కుమ్మరి రాజు, పాల్గొన్నారు. వెలుగోడు: వెలుగోడు సచివాలయం-2 పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువంటి సర్వీస్ చార్జీలు లేకుండా జగనన్న సురక్ష ద్వారా 11 రకాల ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారని అన్నారు. మండల అధ్యక్షులు జెసిఎస్ కన్వీనర్ తిరుపం రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ రమేష్, గ్రామ సర్పంచ్ వేల్పుల జయపాల్,జేపీటీసీ అమిరున్ బీ, జడ్పిటీసీ కో ఆప్షన్ సులేమాన్, మండల ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్ : నందికొట్కూరులోని 11వ సచివాలయం పరిధిలో మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, సచివాలయ జె.సి.యస్ కన్వీనర్ అబూబక్కర్ , కౌన్సిలర్ లు కొండ్రెడ్డి విజయమ్మ , చింతా లక్ష్మిదేవి, పాల్గొని ధృవపత్రాలను అందజేశారు. చాగలమర్రి: పెద్ద వంగలి, మల్లివేముల సచివాలయం వద్ద ఆ గ్రామాల సచివాలయాల సర్పంచులు బంగారు షరీఫ్, ఈదుల సరోజమ్మ, ఈదుల దస్తగిరి రెడ్డి లక్కిరెడ్డి శ్రీలత లక్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీవో మొహమ్మద్ దౌల, మండల విస్తరణ అధికారి సుదర్శన్ రావు పర్యవేక్షణలో నిర్వహించారు. 590 మందికి వివిధ రకాల సేవా పత్రాలను అధికారులు, సర్పంచ్‌లు అందజేశారు. పాములపాడు : మండలంలోని చెలిమిల్ల గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపీడీవో గోపికృష్ణ, తాసిల్దార్ రత్న రాధిక పాల్గొన్నారు. వివిధ రకాల సర్టిఫికెట్లను సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంపిటిసి సురేష్, ఎంపీడీవో, తాసిల్దార్ పంపిణీ చేశారు. ఇఒఆర్‌డి శ్రీనివాస్ నాయుడు, ఏవో పనిశ్వర్ రెడ్డి, ఎంఈవో బాలాజీ నాయక్, ఏపీవో విమలమ్మ, వైసిపి నాయకులు రమణారెడ్డి, జూటూరు మధు, కో ఆప్షన్ నెంబర్ ముతుజావలి, అంబయ్య, ఉపేంద్ర, శివలింగం పాల్గొన్నారు. పగిడ్యాల : మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో సచివాలయం 1 పరిధిలో సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి అధ్యక్షతన జగనన్న సురక్ష నిర్వహించారు. సర్పంచు కూరాకుల రాజేశ్వరి, ఎంపిడిఓ వెంకట రమణ, తహశీల్దార్ భారతిలు ధ్రువపత్రాలను అందజేశారు. ఈఓఆర్‌డి నాగేంద్రయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మిడుతూరు : నాగలూటీ గ్రామంలో 594 మంది లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను సర్పంచి ఉషారాణి అందజేశారు. ఎంపిడిఒ నాగ శేషాచల రెడ్డి, తహసిల్దార్ ప్రకాష్ బాబు, ఈఓ ఆర్ డిఫక్రుధీన్, ఏఓ పిర్ నాయక్, నబీ రసూల్, సింగిల్ విండో చెర్మన్ టీ నాగతొలసిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాల్లారెడ్డి, టీ సర్వేశ్వర రెడ్డి, టీ రాభూపల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బేతంచెర్ల: నగర పంచాయతీలోని ఐదు, ఆరు వార్డులలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డిలు పాల్గొని ధృవపత్రాలను అందజేశారు. సింగిల్ విండో అధ్యక్షుడు రుద్రవరం నారాయణ, తాసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మురళి కృష్ణ, నాగరాజు వైస్ కాజా, కౌన్సిలర్లు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : మండలంలోని కొక్కెరంచ గ్రామంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అధికారి రఘురాం, జడ్పిటిసి సోముల సుధాకర్ రెడ్డి పాల్గొని సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మేరీ, తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, వైస్ ఎంపీపీ సింగారం రంగా, తదితరులు పాల్గొన్నారు. మహానంది : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వంలో ప్రజల గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. గురువారం మహానంది మండలం గాజులపల్లి గ్రామ సచివాలయం-2 పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ న్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. వైసిపి శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










