Aug 17,2023 20:55

సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఆర్‌డిఒ హేమలత


పార్వతీపురం రూరల్‌: మండలంలోని కృష్ణపల్లి లో గృహ నిర్మాణాలను ఆర్‌డిఒ కె.హేమలత గురువారం పరిశీలించారు. జిల్లా స్థాయి గృహ ప్రవేశాల కార్యక్రమం కృష్ణపల్లిలో ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించిన సంగతి విదితమే. గృహ ప్రవేశాల కార్యక్రమం నాటికి ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో అన్ని శాఖల అధికారులు సంబంధిత చర్యలు చేపట్టారు. పనులు వేగవంతం చేయాలని ఆర్‌డిఒ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.