ప్రజాశక్తి-చల్లపల్లి : కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా జగనన్న ఇళ్ల నిర్మాణానికి రూ.2లక్షలు చొప్పున రుణాలు ఇస్తున్నట్లు కేడీసీసీ బ్యాంకు ఛైర్ పర్సన్ తాతినేని పద్మావతి తెలిపారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డలో రూ.40లక్షలతో నిర్మించిన నూతన పీఏసీఎస్ గిడ్డంగిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాతినేని పద్మావతి ముఖ్య అతిధులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ సీఎం జగన్ సహకారంతో కేడీసీసీ బ్యాంకు విస్తత అభివద్ధి సాధిస్తోందన్నారు. రైతులకు కేడీసీసీ బ్యాంకు ద్వారా, సొసైటీల ద్వారా విస్తత రుణాలు అందిస్తూ గ్రామీణ వ్యవసాయ రంగాభివద్ధికి కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి టిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, సర్పంచ్ వల్లూరు ఉమా, పిఎసిఎస్ చైర్పర్సన్ హనుమాన్ల సురేంద్రనాథ్ బెనర్జీ,, ఎస్సీ సెల్ నాయకులు మద్దాల వీరస్వామి, పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు










