ప్రజాశక్తి - కురుపాం : ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగను పురస్కరించుకొని కురుపాం జామి మసీద్ కమిటీ ముస్లిం మత సభ్యులు మత గురువు షేక్ సర్దార్ మాలీo ఆధ్వర్యంలో గురువారం శివన్నపేట మసీదు నుండి రావాడ జంక్షన్ వరకు మహమ్మద్ ప్రవక్త సూక్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మత గురువు మాట్లాడుతూ ప్రవక్తలకు పండితుడు మదీనా పట్నానికి మహారాజు దైవ ప్రవక్తను ఎక్కువగా ప్రార్ధించే ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు వారు మసీదు మరియు ఇంటివద్ద ఆకుపచ్చని జండాలను ఆవిష్కరించుకొని ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు షేక్ నిషార్ , షేక్ ఆదిల్, షేక్ జిలాని షేక్ నూరేళ్ల తదితరులు పాల్గొన్నారు.










