ఇంటర్నెట్ డెస్క్ : శాంసంగ్, షావోమి, ఒప్పో, హువావే, గూగుల్ పిక్సెల్ సంస్థలకు చెందిన కొన్ని మొబైల్స్ వైరస్ బారిన పడే అవకాశముందని జెడ్ డీ నెట్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆండ్రాయిడ్ కెర్నెల్ కోడ్ లో ఒక లోపాన్ని వారు కనుగొన్నారు. ఒకవేళ హ్యాకర్లు ఈ లోపాన్ని కనుగొన్నట్లయితే.. మీ స్మార్ట్ ఫోన్లోకి వారు చొరబడి మీ డేటాని దొంగిలించే అవకాశం ఉంది. గూగుల్ కూడా దీన్ని ప్రమాదంగానే గుర్తించింది. ఇదే విషయాన్ని గూగుల్ తన ఆండ్రాయిడ్ భాగస్వాములకు ప్రకటించింది. ఆండ్రాయిడ్ కామన్ కెర్నెల్కు సంబంధించిన ప్యాచ్‌ను అందుబాటులో ఉంచినట్లు తన ఆండ్రాయిడ్ భాగస్వాములకు తెలిపింది. అంటే ఈ ఫోన్లు ఉపయోగించేవారు అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ని తప్పనిసరిగ్గా డౌన్ లోడ్ చేసుకోవాలి. ఒక్కసారి అప్ డేట్ చేసుకుంటే ఈ ఫోన్లకు ఇక వైరస్ ముప్పు లేనట్లే.
గూగుల్ పిక్సెల్ 2
2017 అక్టోబర్ లో విడుదలైన ఈ మొబైల్‌కు సంబంధించి ఆండ్రాయిడ్ 9 జూఱవ ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్ వేర్లకు సంబంధించిన ప్రివ్యూ వెర్షన్లకు ఈ వైరస్ ముప్పు పొంచి ఉంది. ఒకవేళ మీరు ఈ గూగుల్ పిక్సెల్ 2 మొబైల్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే సెక్యూరిటీ ప్యాచ్‌ను డౌన్ లోడ్ చేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్7
ఈ ఫోన్ లాంచ్ అయి చాలా కాలం అవుతోంది. ఎప్పుడో 2016 మార్చిలో లాంచ్ అయిన ఈ మొబైల్‌ను మీరు ఇప్పటికీ ఉపయోగిస్తున్నట్లయితే.. జాగ్రత్తగా ఉండక తప్పదు. వెంటనే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్9
గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఉన్న మరో మొబైల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్9లో కూడా ఈ లోపం ఉన్నట్లు తెలిసింది. ఈ ఫోన్‌ను 2018 మార్చిలో లాంచ్ చేశారు. ఒకవేళ మీరు ఈ శాంసంగ్ ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.
హువావే పీ20
ఈ జాబితాలో ఉన్న ఏకైక హువావే మొబైల్ ఇదే. ఇది కూడా 2018 మార్చిలోనే లాంచ్ అయింది. ఎలా వచ్చిందో తెలీదు కానీ హువావే ఫోన్లలో కేవలం ఈ ఒక్క మొబైల్లో మాత్రమే ఈ లోపం ఉన్నట్లు గూగుల్ కనుగొంది. కాబట్టి ఈ ఫోన్ ఉపయోగించే వారు కూడా అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ డౌన్ లోడ్ చేసుకోక తప్పదు.
షావోమి రెడ్ మీ 5ఏ
ఈ జాబితాలో ఉన్న మూడు షావోమి స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. 2017 డిసెంబర్లో ఈ ఫోన్ మొదట మార్కెట్లో లాంచ్ అయింది. బడ్జెట్ వేరియంట్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మొబైల్‌కు కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను ఎక్కువ మంది వినియోగదారులు కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీ డేటా హ్యాకర్ల జోలికి పోకుండా ఉండటానికి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ను డౌన్ లోడ్ చేసుకోండి.
షావోమి ఎంఐ ఏ1
షావోమి నుంచి వచ్చిన మొదటి ఆండ్రాయిడ్ వన్ మొబైల్ అయిన ఏ1 కూడా ఈ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న ఫోన్ల జాబితాలో ఉంది. మీరు ఈ ఫోన్ వాడుతున్నట్లయితే వెంటనే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా గూగుల్ సూచించింది.
షావోమి రెడ్ మీ నోట్ 5
షావోమి రెడ్ మీ నోట్ 5 కూడా ఈ వైరస్ ప్రమాదంలో ఉంది. 2018 ఫిబ్రవరిలో ఈ ఫోన్‌ను షావోమి లాంచ్ చేసింది. మీరు ఈ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
ఒప్పో ఏ3
ఈ జాబితాలో ఉన్న ఫోన్లన్నిటిలో తాజాగా లాంచ్ అయిన ఫోన్ ఇదే. 2019 ఏప్రిల్‌లో ఈ ఫోన్‌ను ఒప్పో మార్కెట్లో లాంచ్ చేసింది. అంతేకాకుండా ఈ ఫోన్లో ఉన్న ఏకైక ఒప్పో కంపెనీ ఫోన్ కూడా అదే. కాబట్టి మీరు కూడా ఈ ఫోన్‌ను వాడుతున్నట్లయితే వెంటనే సెక్యూరిటీ ప్యాచ్‌ను డౌన్ లోడ్ చేసుకోండి.










