ఇంటర్నెట్ డెస్క్ : షియోమీ తన రెడ్ మీ నోట్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రెండువేలకు తగ్గించింది. ఈ ఫోన్ రెండు నెలల క్రితమే మన దేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక ఫోన్ విషయానికి వస్తే.. 6.67 అంగుళాల సూపర్ అమోఎల్‌ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించారు. వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 నుంచి రూ.15,999కు తగ్గింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999కు, హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999కు తగ్గింది. డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, వింటేజ్ బ్రాంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.










