అనంతపురం : అనంతపురం రూరల్ మండల పరిధిలోని చియ్యేడు, పూలకుంట గ్రామాల్లో జరుగుతున్న ఈ పంట నమోదును మండల వ్యవసాయ అధికారిని శశికళ బుధవారం పరిశీలించారు. కంది, వేరుశనగ పంటలను పరిశీలించారు. రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణి చేయాలనీ, పిఎం కిసాన్, ఈకెవైసి, కౌలు రైతులకు రుణాలు ఇప్పించే విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ విస్తరణ అధికారి మురళి, ఆర్‌బికె భువనేశ్వరి, కవిత పాల్గొన్నారు.
ఈ పంట నమోదు పరిశీలన
పెద్దవడుగూరు : మండలంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని గుత్తి వ్యవసాయశాఖ ఎడిఎ వెంకటరాముడు బుధవారం పరిశీలించారు. గ్రామంలోని 15వ డిస్ట్రిబ్యూటరీ కాలువ సమీపంలో రైతులు సాగుచేసిన పలు పలు పంటలను ఈ క్రాప్ నమోదు చేయించారు. నిర్ధేశించుకన్న సమయంలోపు పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన గ్రామంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన వాటికి కంప్యూటర్ రసీదులు తప్పక ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి మల్లీశ్వరి, ఆర్‌బికె విఏవో జయలక్ష్మి పాల్గొన్నారు.










