Aug 26,2023 21:24

ఇ-పంట నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్న జెసి గోవిందరావు

ప్రజాశక్తి-పాలకొండ రూరల్‌ : ఇ-పంట నమోదు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అధికారులను ఆదేశించారు. పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో ఇ-పంట నమోదు ప్రక్రియను శనివారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో పంట నమోదు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇ-పంట నమోదుకు రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. రైతులు పంట నమోదులో వ్యవసాయ శాఖకు సహకరించాలని అయన కోరారు. పిఎం కిసాన్‌కు సంబంధించి 805 ఖాతాలకు అవసరమైన మేరకు మ్యుటేషన్లు, ఆధార్‌ తప్పుగా ఉంటే వాటిని సరిచేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బందికి పాల్గొన్నారు.