ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని ఫెర్టిలైజర్స్ నిర్వాహకులు ఈ-పాస్ మిషన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని ఎడిఎ మహ్మద్ ఖాద్రీ సూచించారు. శుక్రవారం మండలంలోని మాధవరం, తుంగభద్ర గ్రామాల్లోని మారుతి ట్రేడర్స్, పంచముఖి ట్రేడర్స్, భీమా ట్రేడర్స్, సిద్ధి వినాయక ట్రేడర్స్, శ్రీరామ్ ట్రేడర్స్ దుకాణాలను ఎఒ గణేష్‌తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో గల ఎరువుల నిల్వల వివరాలు, రైతులకు ఇస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిల్వల్లో తేడాలు వస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పురుగు మందులు శ్యాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం తీసుకున్నారు. ఎఇఒ నరసింహులు ఉన్నారు.
రికార్డులను పరిశీలిస్తున్న ఎడిఎ










