ఈ-క్రాప్ నమోదును పరిశీలిస్తున్న ఎడిఎ సునీత
ప్రజాశక్తి-ఆలూరు
ఈఏడాది ఖరీఫ్‌లో పంట సాగు చేసిన ప్రతి రైతూ ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని ఆలూరు ఎడిఎ సునీత తెలిపారు. బుధవారం ఆలూరు పట్టణ ప్రాంతంలోని రైతుభరోసా కేంద్రం-1 ఆధ్వర్యంలో రైతులతో కలిసి పంట పొలాల్లో ఈ-క్రాప్ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ-క్రాప్ నమోదు చేసుకోకపోతే పంట నష్టపరిహారం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రైతు భరోసాకు అనర్హులు అవుతారని తెలిపారు. ఈ-క్రాప్ నమోదుకు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, భూమి పాస్ పుస్తకం, రైతు బ్యాంకు పుస్తకం జిరాక్స్‌తో పాటు సెల్ నెంబరుతో రైతుభరోసా కేంద్రంలో సంప్రదించాలని కోరారు. ఎఒ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.










