- జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : నిరుపేదలను ఆదుకోవడంలో మచిలీపట్నం బెరాక మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ సేవ స్ఫూర్తిని అభినందిస్తున్నానని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. బెరకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలైన 19 మంది వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న దృశ్య, మరియు ఇంటి నిర్మాణం కొరకు అవసరమైన సామగ్రి, ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి వైద్య ఖర్చులు నిమిత్తం, విద్య కోసం, వ్యాపార కోసం రూ:12,00,000 చెక్కులను, మరియు సామగ్రి రూపంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు చేతులు మీదుగా గురువారం కలక్టరేట్ ఆవరణలో లబ్ది దారులకు పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ,మాట్లాడుతూ పేద ప్రజలకు తన వంతు సహాయం అందిస్తున్న కిరణ్ పాల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలవాలని సూచించారు.ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కిరణ్ పాల్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నమన్నారు. మున్ముందు ఇటువంటి సేవ కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ నాగిశెట్టి డానియల్, వెలుగు ఫౌండేషన్ చైర్మన్ చందమామ బాబు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










