ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని ద్వారక టాకీస్ సమీపంలో ఉన్న హోటల్‌లో తినుబండారాలను పరిశీలించారు. బిర్యానీలో కలర్ మోతాదుకు మించి వేస్తున్నారని, పరిసరాలు పరిశుభ్రంగా లేవని జరిమానాలు విధించారు. వెల్కమ్ హోటల్‌కు రూ.3 వేలు, మిల్ట్రీ హోటల్‌కు రూ.2 వేలు, ఉషా స్టార్ హోటల్‌కు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ హరినాథ్, శ్రీనివాసులు, మంజునాథ, మేస్త్రి మహబూబ్ బాషా ఉన్నారు.










