Aug 30,2023 21:21

వేలం పాటలో పాల్గొన్న పత్తికొండ డిఎల్‌పిఒ ప్రకాష్‌ నాయుడు

ప్రజాశక్తి - ఆస్పరి
ఆస్పరి పంచాయతీ ఆవరణలో కూరగాయల మార్కెట్‌ వేలంపాటలు హోరాహోరీగా సాగాయి. బుధవారం పత్తికొండ ఇన్‌ఛార్జీ డిఎల్‌పిఒ ప్రకాష్‌ నాయుడు ఆధ్వర్యంలో మార్కెట్‌ వేలం పాట నిర్వహించారు. సర్పంచి మూలింటి రాధమ్మ అధ్యక్షతన వేలం పాట ప్రారంభించారు. ఆరుగురు పాటదారులు పాల్గొన్నారు. రసవత్తరంగా సాగిన వేలం పాటలో బోల్లురు ఆంజినేయులు రూ.56,01,000లకు పాట దక్కించుకున్నారు. పోయిన సారికంటే ఈసారి రూ.90 వేలు అధికంగా పంచాయతీకి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో 25 శాతం అంటే రూ.14,00,250 గ్రామాభివృద్ధికి తీసేసినట్లు డిఎల్‌పిఒ ప్రకాష్‌ నాయుడు తెలిపారు. మిగిలిన రూ.42,00,750 పంచాయతీకి జమ చేయాలన్నారు. సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, జడ్‌పిటిసి దొరబాబు, సొసైటీ జిల్లా డైరెక్టర్‌ రాఘవేంద్ర, సిఇఒ అశోక్‌, సొసైటీ మాజీ డైరెక్టర్‌ కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రామాంజినేయులు, వైస్‌ సర్పంచి వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలు తిమ్మన్న, సంజప్ప, నరసప్ప, రంగన్న, రామాంజినేయులు, లక్ష్మన్న పాల్గొన్నారు.