ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని బిణిగేరి గ్రామ సచివాలయ కార్యాలయంలో శుక్రవారం కూరగాయల మార్కెట్ వేలంపాట హోరాహోరగా సాగింది. శుక్రవారం పత్తికొండ ఇన్‌ఛార్జీ డిఎల్‌పిఒ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ వేలం జరిగింది. సర్పంచి వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ వేలం పాటలో ఐదుగురు పాటదారులు పాల్గొనగా ఈరన్న రూ.8.20 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇఒఆర్‌డి నరసింహారెడ్డి, సర్పంచి వెంకటేష్ మాట్లాడారు. గ్రామంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం పంచాయతీ తీర్మానం మేరకు వేలం పాటలో వచ్చిన నగదు రూ.4.10 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. మిగిలిన నగదు రూ.4.10 లక్షలు పంచాయతీకి జమ చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ నిబంధనల మేరకే వేలం పాటను దక్కించుకున్న కాంట్రాక్టర్ నడుచుకోవాలని చెప్పారు. కార్యదర్శి నబీసాబ్, చిగిలి-2 సచివాలయ కార్యదర్శి నాగమణి, ఎంపిటిసి లక్ష్మీ, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, శ్వేతవాహన రెడ్డి, శేషాద్రి నాయుడు, వెంకటేశులు, సోమన్న, భీమన్న పాల్గొన్నారు.
వేలం పాటలో మాట్లాడుతున్న అధికారులు










