ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని బదినేహాల్ గ్రామంలో హోరాహోరీగా సాగిన సర్పంచి ఉప ఎన్నికల్లో వైసిపి మద్దతు దారుడు పెద్ద నరసప్ప ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 3,177 ఓట్లకు గాను 2,128 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసిపి మద్దతుదారుడు పెద్ద నరసప్పకు 1,186 ఓట్లు రాగా, టిడిపి మద్దతుదారుడు హెచ్.వీరేష్ కు 799 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 99, నోటా 44 ఓటర్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జనార్ధన్ తెలిపారు. పెద్ద నరసప్ప 387 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసిపి నాయకులు నాకేష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీంద్ర రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మాబు సాబ్, ప్రసన్న కుమార్ గౌడ్ మాట్లాడారు. గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల అధికారి జనార్ధన్, ఎంపిడిఒ సుబ్బరాజులు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
భారీ బందోబస్తు : బదినేహాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ సీతారామయ్య, సిఐ ఎరిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మరో ముగ్గురు ఎస్‌ఐలు, 160 మంది పోలీసులు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు.










