Aug 03,2023 22:58

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో, మన రాష్ట్రంలోనూ మహిళలపై హింస రోజురోజుకి విపరీతంగా పెరుగుతుందని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న ఈ తరుణంలో హింసను అరికట్టేవరకు మహిళలందరూ ఉద్యమం చేయాలని అవశ్యకత ఏర్పడిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత పిలుపునిచ్చారు. గురువారం రాజుపేట లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో హింసపై మహిళల పోరుయాత్ర జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు జరుగుతున్న రాష్ట్ర యాత్రను జయప్రదం చేయాలని, ఆగస్టు 8న జింఖానా గ్రౌండ్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల చులకనా భావంఉంది అని, దానివల్లే స్త్రీలను రెండవ స్థాయి వ్యక్తులుగా, లైంగిక వస్తువులుగా చూపెడుతున్నారనిఆమె అన్నారు. గత కాలంలో మహిళలపై ఆంక్షలు విధించి, అణచివేతకు గురిచేసిన పురుషాధిపత్య సిద్ధాంతాన్ని తిరిగి సమాజంపై మహిళలపై బలవంతంగా రుద్దుతున్నరాన్నారు .మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో క్రైమ్‌ రేటు విపరీతంగా జరిగిందన్నారు. కష్ణా నది తీరంలో యువజంటపై దాడి, గుంటూరులో డెంటల్‌ విద్యార్థి హత్య, రమ్య హత్య, విశాఖలో వరలక్ష్మీ హత్య ఈ కాలంలో సంచలనం కలిగించాయి.2020 కంటే 2021లో మహిళలపై నేరాలు 20 శాతం పెరిగాయని (14603ు17736) గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. నిర్భయ దిశ కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయని, మద్యం మత్తు మందులు ప్రధానంగా ఈ నేరాలు పెరగటానికి ఒక కారణం అని అనేక సర్వేలు తెలుపుతున్నప్పటికీ వాడిని అరికట్టే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదన్నారు. మహిళల సమస్యలు పరిష్కారం కోసం, హక్కుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మహిళలపై పెట్టే నిమిషాలు వ్యతిరేకిస్తూ ఆగస్టు 8న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా సంఘం కమిటీ సభ్యురాలు బూర భవాని, పేటేటి. స్రవంతి, తాడంకి. స్వర్ణలత, పేటేటి ఎస్తేరమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.