పోలీసుల అదుపులో ఉన్న వరుణ్
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
హామీలను నెరవేర్చాలని కోరితే అరెస్టు చేస్తారా అంటూ జనసేన సీనియర్ నాయకులు చల్లాశ్రీ వరుణ్ మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న చల్లాశ్రీ వరుణ్‌ను, ఆయన అనుచరులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.










