Jul 31,2023 20:43

వైసిపి జెండాను ఆవిష్కరిస్తున్న సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన

ప్రజాశక్తి - ఆస్పరి
నవరత్నాల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన తెలిపారు. సోమవారం మండలంలోని అట్టేకల్‌ మేజర్‌ పంచాయతీ ఐనేకల్లు గ్రామంలో వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాలంటీరు, సచివాలయ వ్యవస్థతో ప్రజల ఇంటి ముందుకే పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ విజయం సాధించి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. వైసిపి మండల కన్వీనర్‌ పెద్దయ్య, సీనియర్‌ నాయకులు హనుమంతు రెడ్డి, నాయకులు గోవిందు, గుర్రప్ప, గోవిందరాజులు, రంగస్వామి, శేషప్ప, బాలకృష్ణ, శివ, శేఖర్‌, లాలు, మహానంది, మల్లికార్జున, సుధాకర్‌, హరి, నాగరాజు, తిమ్మప్ప పాల్గొన్నారు.