నివాసం వద్ద నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
హామీల అమలు ఎక్కడ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఫ్లకార్డులు, నల్ల కండువాలతో నిరసన తెలుపుతున్న తమను, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడం దురదృష్టకరమని తెలిపారు. గతంలో టిడిపి హయాంలో మంజూరు చేసిన ఆర్‌డిఎస్ ప్రాజెక్టు, టెక్స్‌టైల్స్ పార్కు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.










