Jul 18,2023 16:28

ప్రజాశక్తి-వెల్దుర్తి (కర్నూలు) : ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈనెల 8వ తేదీన జరిగిన సమావేశంలో ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చినటువంటి హామీలు పే స్కేల్‌ అమలు చేయాలి, 60 సంవత్సరాలు పైబడిన ప్రతి వీఆర్‌ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఎగ్జామ్‌ లేకుండా గ్రేడ్‌ వన్‌ వీఆర్వో ప్రమోషన్‌ ఇవ్వాలి. ఈ అంశంపై అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లిన ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కారం చేయలేదన్నారు. వీటి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి పోరాటానికి రాష్ట్ర కమిటీ పిలుపు ఇచిచ్నట్లు తెలిపారు. ఈనెల 20, 21, తేదీన అన్ని మండలాల్లో వీఆర్‌ఏలు దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 7, 8, తేదీన జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో దీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గ్రామ సేవకుల సంఘం మండలాధ్యక్షుడు అయ్య స్వామి, ఉస్మాన్‌, భాష, ఖాజా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.