- ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఇల్లు నిర్మించుకొని కరెంటు లేక ఇల్లు ఖాళీ చేసిన ఎస్సీ బీసీ కుటుంబాలు.
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : వరద బాధిత కాలనీలో పదేళ్లు గడిచిన అధికారులు అడుగుపెట్టలేదని వారి సమస్యలు పట్టించుకోకపోవడంతో నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయని పట్టణ పార సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ. పుల్లారెడ్డి విమర్శించారు. 2009 అక్టోబర్లో వచ్చిన భారీ వరదల వల్ల సర్వం కోల్పోయిన తుంగభద్ర నది వెంట ఉన్న పేదలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సమీపంలో ఇంటి స్థలాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. కొందరు ఇల్లు నిర్మించుకొని కరెంటు కోసం ఎదురు చూసి చూసి చీకట్లో జీవించలేక ఇల్లు ఖాళీ చేశామని దళిత వెనుకబడిన వర్గాల ప్రజలు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం వరద బాధిత కాలనీల పర్యటించింది.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి, స్థానికులు యు. మదిలేటి,ఏ .మధు మాట్లాడుతూ కరెంటు, తాగునీరు కోసం ఎదురుచూసి అధికారులు స్పందించనందున నిర్మించు కున్న ఇండ్లను కూడా ఖాళీ చేశారన్నారు. ఇల్లు నిర్మించుకోవడం కోసం
నిర్మించిన నీటి నిలువ ఔజు శిథిలావస్థకు చేరిందన్నారు. ఇన్ని సమస్యలున్న ప్రభుత్వ అధికారులు ఆ కాలనీలో అడుగు పెట్టలేదని విమర్శించారు.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కరెంటు స్తంభాలు,త్రాగునీరు ఏర్పాటు చేసి దళితులు,వెనుక బడిన నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ పర్యటనలో డి. కుమార్,షేక్ .సమీవుల్లా,కె. అయ్యన్న,యు. రవీంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు.










