Sep 27,2021 18:27

మన స్మార్ట్‌ మొబైల్‌ లో ఏదైనా సెర్చ్‌ చేయాలంటే వెంటనే గూగుల్‌ క్రోమ్‌ ఓపెన్‌ చేస్తాం. ఇప్పుడు ఆ గూగుల్‌ క్రోమ్‌ కు హ్యాక్‌ సమస్య వచ్చిపడిందని ప్రపంచవ్యాప్తంగా క్రోమ్‌ యూజర్లకు గూగుల్‌ హెచ్చరికలను జారీ చేసింది. వెంటనే క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని యూజర్లకు గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ తన అధికారిక బ్లాగ్‌ పోస్ట్‌లో లైనక్స్‌, మాక్‌ఓఎస్‌, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో నెలకొన్న సమస్యలను గూగుల్‌ వెల్లడించింది. జీరో డే హ్యాక్‌ పేరిట పలు క్రోమ్‌ యూజర్లపై సైబర్‌ దాడులు జరుగుతున్నట్లు గూగుల్‌ పేర్కొంది. తాజాగా గూగుల్‌ తెచ్చిన కొత్త అప్‌డేట్‌తో మరింత సెక్యూర్డ్‌ బ్రౌజింగ్‌ అనుభూతిని పొందే అవకాశం ఉంది.
మీ స్మార్ట్‌ఫోన్‌ ని చెక్‌ చేసుకోండి...
మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి, సెర్చ్‌ బార్‌ పక్కన ఉన్న త్రి డాట్స్‌పై క్లిక్‌ చేయండి. తరువాత 'సెట్టింగ్‌' ఆప్షన్‌ను ఎంచుకోండి. సెట్టింగ్‌ ఆప్సన్‌లో చివరి ఆప్షన్‌ 'అబోట్‌ క్రోమ్‌'ను సెలక్ట్‌చేయండి. అబోట్‌ క్రోమ్‌ పై క్లిక్‌ చేస్తే... మీకు ఆప్లికేషన్‌ క్రోమ్‌ వర్షన్‌ కన్పిస్తోంది. మీరు వాడే క్రోమ్‌ వెర్షన్‌ 94.0.4606.61 ఉంటే మీరు వాడే బ్రౌజర్‌ సురక్షితంగా ఉన్నట్లు.. లేకపోతే వెంటనే గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి అప్‌డేట్‌ చేయండి.