Oct 24,2023 08:09

హైదరాబాద్‌ : శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడి బ్యాగులో 610 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.32.8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరో ప్రయాణికుడి వద్ద 483 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.