విక్రం సారాభారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఉపాధ్యాయులు
ఘనంగా విక్రం సారాభారు జయంతి వేడుకలు
ప్రజాశక్తి-డోన్
డోన్ పట్టణం లోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విక్రం సారాభారు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విక్రం సారాభారు అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించడానికి కృషిచేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మయ్య, అల్లిపీరా, సుబ్బారాయుడు,రఘునాథ్,ప్రసాద్ రెడ్డి,రాజా కుల్లాయప్ప, చంద్రమోహన్, సుబ్రమణ్యం,రాజన్న తదితరులు పాల్గొన్నారు.










