
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు తోటపల్లిగూడూరు మండలంలో శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. వైసీపీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జగనన్న సచివాలయాల ఇంచార్జ్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు తలమంచి సురేంద్ర బాబు, జెడ్పిటిసి శేషమ్మ, ఏఎంసి డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, సర్పంచ్ కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం గౌడ్, వైసీపీ నాయకులు ఎంబేటీ సంధ్యారాణి, సోషల్ మీడియా కన్వీనర్ పవన్, కో కన్వీనర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ ఓ ప్రభంజనం అన్నారు. రాజశేఖర్ రెడ్డి నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయతలు వుంటాయని కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని
గుణంతో వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
వేసుకున్నారని తెలిపారు. అంతటి మహానేతను
ల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయని, అయితే ఆ జ్ఞాపకాలు నేటికీ ప్రజల హదయాల్లో చెరిగిపోలేదన్నారు. ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఉజ్వలంగా వెలుగొందుతోందన్నారు. దీనికి ముందు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ముసలి పరంధామయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.