Mar 28,2023 22:46

snathakostavam

ఘనంగా వైద్యుల స్నాతకోత్సవం
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం మండలం చిన్న అవుటపల్లి లోని డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి 2017వ బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు పట్టాలు డాక్టర్‌ వైఎస్సార్‌ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కోరుకొండ బాబ్జి, కళాశాల డీజీ చదలవాడ నాగేశ్వరరావు పంపిణీ చేశారు. తొలుత విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అతిథులకు స్వాగతం పలికారు. బాబ్జి మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉత్తమ సేవలందించాలని యువ వైద్యులకు సూచించారు. దయా హృదయంతో అందించే సేవలతోనే వైద్యునికి సంతృప్తి ఉంటుందన్నారు. నైతిక విలువలతో కూడిన వైద్యులుగా మెరుగైన సేవలందించాలని డీజీ నాగేశ్వరరావు కోరారు. డాక్టర్లుగా పట్టా పొందిన తర్వాత మీరు సమాజంలో చేసే సేవలు మంచి పనులు గుర్తింపు తెస్తాయని చెప్పారు. కార్యక్రమంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులు.. తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.