అక్షర రూపంలో ఉన్న విద్యార్థులు
ప్రజాశక్తి - కౌతాళం
వ్యవహారిక భాషోద్యమ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్‌లో తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రతిభ హైస్కూల్‌లో రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ దూద్ బాషా మాట్లాడారు. ప్రతేడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 'తెలుగు' భాషకు అక్షర శుభాకాంక్షలు తెలిపారు. 'తెలుగు' ఆకారంలో అక్షర చైతన్యం కల్పించారు. పాఠశాల సెక్రటరీ మైనుద్దీన్, ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










