ఘనంగా సెల్వమణి జన్మదిన వేడుకలు
ఘనంగా సెల్వమణి జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : రాష్ట్ర మంత్రి ఆర్‌కె రోజా భర్త ఆర్‌కె సెల్వమణి 60వ జన్మదిన వేడుక లు నగరి నియోజకవర్గ ప్రజలు మధ్య ఆదివారం ఘనం గా నిర్వహించారు. పుత్తూరు మున్సిప ల్ చైర్మన్ ఎ హరి, వైస్ చైర్మన్ డి జయప్రకాష్, వైసిపి నాయకులు మోహన్ రెడ్డి కలసి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి భర్త ఆర్‌కె సెల్వమణి ప్రతి సంవత్సరం జన్మదిన సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తామని, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మునెయ్య, సుదర్శనం, ఎంపీపీ మునివేలమ్మ, వైసిపి నాయకులు పా ల్గొన్నారు.










