హిందూపురం : క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన, నియమ నిష్టలతో కఠిన ఉపవాస దీక్షల కలయికే పవిత్ర రంజాన్ పండుగ అని మేళాపురం సున్నీ జామీయ మసీదు మౌలానా ఖమర్ ఆలి ఖాద్రి అన్నారు. శనివారం పట్టణంలో రంజాన్ పండుగను ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకొన్నారు, ఈ సందర్బంగా అల్ హి లాల్ పాఠశాల ఆవరణంలో ఉన్నా ఈద్గా మైదానం, మేళాపురం సున్నీ జామీయ ఈద్గా మైదానం, కోట, రహమత్‌పురం, మోడాల్‌కాలోని, శాంతినగర్, గౌసీయ మసీదు తదితర ప్రాంతాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో ముస్లీం సోదరులతో కలిసి ఎపి ఆగ్రోస్ చైర్మేన్ నవీన్ నిశ్చల్, టిడిపి ఇన్‌చార్జ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బాలాజి మనోహర్‌తో పాటు ఆయా పార్టీల ముఖ్య నాయకులు, జామీయ మసీదు కమిటీ ముత్వల్లీ నురూల్లా, సున్నీ జామియా మసీదు ముత్వల్లీలు తదితరులు పాల్గొన్నారు. అల్ హి లాల్ ఈద్గ మైదానంలో జరిగిన ప్రార్థనల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ జబివుల్లా, తలహాఖాన్, సిద్దిక్‌షేఠ్, గౌసియా మసీదుల్లో రహమతుల్లా సేఠ్ ఆయా ప్రార్థన ఈద్గ మైదానాల్లో ఆయా ముత్వల్లీలు, మౌలానాలు పాల్గోన్నారు. ఈ సందర్బంగా వైసిపి నాయకులు కట్ల భాష ఆద్వర్యంలో పెద్ద వేలాది మందికి శీతల పానియాలు పంపిణీ చేశారు. రంజాన్ సందర్బంగా వైసిపి, టిడిపి, ప్రజా సంఘాల నాయకులు ముస్లీం సోదరులకు ఈద్గ మైదానంలో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బత్తలపల్లి : రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు అత్యంత పవిత్రమైనవనిఏపీ కురుబ కార్పోరేషన్ చైర్మన్ కోటి సూర్య ప్రకాష్ లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన బత్తలపల్లిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మైనార్టీ నాయకులు కరీంసాబ్, బాబాన్, అబ్దుల్ రజాక్, నడిమింటి షాషు , మౌలా, కాశీంవలి, జిక్రీయా, దాచాఫీర్, చికెన్ దాదా, అలీమౌలా, హసన్వలీ, షాపూ, ఉప సర్పంచు కోటి గోపీనాథ్, ఎంపీటీసీ సభ్యులు కోటి నరేష్, కోటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : పట్టణంలో రంజాన్ వేడుకలను శనివారం ముస్లీంలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ సమీపంలోని కేతిరెడ్డికాలనీలో గల ఈద్గా మైదానంలో మత పెద్దలు, ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం ముతవల్లులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
కదిరి టౌన్ : రంజాన్ పర్వదినం పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరు సుఖ సంతోషాలతో పాడి పంటలతో మెలగాలని ఆకాక్షించారు.
గాండ్లపెంట : మండల వ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ : రంజాన్ సందర్బంగా పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ సోదరభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ముస్లిం సోదరీ, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా జరుపుకున్నారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నమాజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి మాణిక్యం బాబా, దర్గా కమిటీ మేనేజర్ ఆతావుల్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ముస్లిం సోదరులు శనివారం ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రొద్దం : మండలంలోని ఆయా గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కదిరి అర్బన్ : రంజాన్ పర్వదినం సందర్భంగాఈద్గా వద్ద వేలాది మంది ముస్లింలతో కలసి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈప్రార్థనల్లో ఎమ్మెల్యే,తో పాటు మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండి ఇస్మాయిల్, వైసీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, మతపెద్దలు ఉన్నారు.
తలుపుల : స్థానిక కుమ్మరపేట సర్ఫుద్దీన్ బాబా ఈద్గా మైదానంలో తలుపుల గ్రామపంచాయతీకి సంబంధించిన ఆరు మసీదులో ముస్లిం సోదరులు శనివారం రంజాన్ వేడుకలు నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్ : పుట్టపర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం ఈద్-ఉల్-ఫితర్‌ను ముస్లిములు ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయాన్నే స్థానిక ఈద్గాల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. పెడపల్లి, వెంగళమ్మచెరువు, నీడిమామిడి, బీడుపల్లి, గ్రామాల్లో కూడా ఉదయాన్నే ముస్లిములు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పేదలకు దానధర్మాలు చేశారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద పుట్టపర్తి రూరల్ ఎస్సై దాదాపీర్ భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు.
బుక్కపట్నం: రంజాన్ పర్వదినం పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పాముదుర్తి, కష్ణాపురం, తదితర గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ముస్లిములు ర్యాలీగా వెళ్లి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.










