లూయిస్ డాగురేకు నివాళులర్పిస్తున్న సభ్యులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
తాలూకా డిజిటల్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శనివారం పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఫొటో అనేది ఒక మధురమైన జ్ఞాపకమని తెలిపారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. ఫొటోగ్రాఫర్లందరూ ఉన్నతంగా జీవించాలని, రాబోయే కాలంలో దినోత్సవ వేడుకలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరారు.










