ప్రజాశక్తి - కురుపాం : స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఓజోన్ డే దినోత్సవాన్ని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.రామగోవిందం విద్యార్థులచే ఓజోన్ పొరను సూచిస్తూ కూర్చుని పెట్టి ఓజోన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓజోన్ పొర ఆవశ్యకత తెలియజేసి ఎలా పరిరక్షించుకోవాలో విద్యార్థులకు వివరించారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల వద్ద కూడా విద్యార్థులతో ఓజోన్ పొర ఆకారంలో కూర్చుని పెట్టి ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ సంరక్షణ అధికారి కె. సూర్యనారాయణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: అతి నీలోహిత కిరణాల నుండి మానవజాతిని, ఇతర ప్రాణులను కాపాడుకోవాలంటే ఓజోన్ పొరను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డి.రామయ్య అన్నారు. అంతర్జాతీయ ఓజోన్ డే కళాశాలలో నిర్వహించారు. ఓజోన్ పొర భద్రంగా ఉండాలంటే అడవులను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, కాలుష్యాన్ని నివారించాలని ఆయన కోరారు. కళాశాల నుంచి ఎల్విన్‌పేట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పిఒ త్రినాధ, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.
వీరఘట్టం : మండలంలోని ఓజోన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంబరవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓజోన్ అక్షర రూపంలో విద్యార్థులచే ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వై.లక్ష్మీ, ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.










