Aug 29,2023 20:10

మాట్లాడుతున్న విఆర్‌ఒ రంగస్వామి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో విజేత టాలెంట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో మంగళవారం గిడుగు రామ్మూర్తి, ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా మాతృభాష, క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విఆర్‌ఒ మర్లబండి రంగస్వామి హాజరై మాట్లాడారు. తెలుగు భాష విశిష్టతను, ఔన్నత్యాన్ని వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రవేశం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి విద్యార్థీ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని వివరించారు. అనంతరం విద్యార్థులు అమ్మభాష గురించి ఆట పాటలతో, పొడుపు కథలతో, జానపద నృత్యాలతో అలంరించారు. ఉపాధ్యాయులు పురుషోత్తం, పరమేష్‌, రంగస్వామి, పవన్‌, ఉలగప్ప పాల్గొన్నారు.