ఖోఖో అడుతున్న విద్యార్థులు
ప్రజాశక్తి- కందుకూరు : కందుకూరు పట్టణంలోని శ్రీ గాయత్రీ ఐఐటి అండ్ మెడికల్ అకాడమి, డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ సిహెచ్ రామక్రిష్ణ ఆధ్వర్యంలో ''స్పోర్ట్స్ వీక్''కార్యక్రమం వారం రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు.. సంవత్సరమొత్తం చదువుల ఒత్తిడితోఉన్న విద్యార్థులలో మానసిక వికాసం పెంపొం దించే విధంగా కబడ్డీ, కోకో,వాలీబాల్, క్రికెట్ ,రన్నింగ్ వంటి ఆటల పోటీలను చేపట్టారు. డైరెక్టర్ సిహెచ్ భరధ్వాజ్, ప్రిన్సిపాల్ ఉషాచంద్రిక, గీతాశ్రీనివాసరావు, పాతూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










