Aug 16,2023 19:53

దేవనకొండలో నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
దేవనకొండలోని టిడిపి కార్యాలయంలో మండల కన్వీనర్‌ విజరు భాస్కర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతగా నిలిచారని, పేదల ఎదుగుదలే సమాజ నిర్మాణానికి నాంది అని భావించి వారి ఎదుగుదలకు నిరంతరం కృషి చేశారని కొనియాడారు. టిడిపి సీనియర్‌ నాయకులు బండి గింజల రంగన్న, ఉచ్చీరప్ప, మలకన్న, డీలర్‌ బండ్లయ్య, ఆకుల వీరేష్‌, రాజ్‌ గోపాల్‌ గౌడ్‌, రాజశేఖర్‌ గౌడ్‌, చంద్ర, సర్పంచి భర్త బండ్లయ్య, పొట్లపాడు సుధాకర్‌, తెర్నేకల్‌ నాగేష్‌, తెలుగు యువత నాయకులు కాశీం, మస్తాన్‌, డిష్‌ సుభాన్‌, చాంద్‌ బాషా, బాలయ్య ఫ్యాన్స్‌ చాంద్‌ బాషా పాల్గొన్నారు.