ప్రజాశక్తి - చింతలపూడి
సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి మోక్షాగుండ విశ్వేశ్వరయ్య అని చింతలపూడి లయన్స్ అధ్యక్షులు రాజేష్‌నాయుడు తెలిపారు. పట్టణంలో విద్యుత్ శాఖ సెక్షన్ కార్యాలయంలో మోక్షాగుండ విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకొని 'ఇంజనీర్స్ డే' సందర్భంగా ఎఇ వెంకటరమణని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎఇ వెంకటరమణ మాట్లాడుతూ ఇంజనీర్స్ డే సందర్భంగా సత్కరించడం అభినందనీయమన్నారు. మండలంలో మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.










