చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆస్పరి
టిడిపి చైతన్య రథసారధి, సినీరంగంలో నటుడుగా, రాజకీయ నాయకునిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ వర్థంతిని ఆస్పరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి యూత్ మండల కన్వీనర్ రాఘవేంద్ర, సతీష్ కుమార్ మాట్లాడారు. నందమూరి హరికృష్ణ ఆపన్నులకు అండగా నిలిచే వ్యక్తి అని తెలిపారు. ఆత్మీయత, క్రమశిక్షణకు ప్రతి రూపమన్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేశారని కొనియాడారు. గ్రామ కమిటీ అధ్యక్షులు వీరేష్, తెలుగు యువత నాయకులు మహేష్, మారేష్, వీరేష్, జూనియర్ ఎన్‌టిఆర్ సేవా సమితి అధ్యక్షులు వీరేష్ పాల్గొన్నారు.










