కేక్ కట్ చేస్తున్న డైరెక్టర్ అక్రమ్ , ప్రిన్సిపల్ ఫణి కుమార్, అధ్యాపకులు
ధర్మవరం టౌన్ : పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో గురువారం గణాంకాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పణికుమార్, కళాశాల డైరెక్టర్ అక్రమ్ మాట్లాడుతూ గణాంకాల శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాల జయంతి వేడుకలను జరుపుకోవడం ఆనందం ఉందన్నారు. జీవితంలో గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను డైరెక్టర్, ప్రిన్సిపల్ విద్యార్థులకు వివరించారు. అనంతరం గణాంకాల శాస్త్రంలో వంద మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చాంద్‌బాషా, డైరెక్టర్లు, అధ్యాపకులు జితేంద్ర, చంద్రిక, కీర్తి ప్రియ, అల్తాఫ్ తో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.










