Aug 23,2023 22:28

గద్దర్‌కు నివాళ్లు అర్పిస్తున్న దళిత సంఘాల నాయకులు

పాలకొండ: డివిజన్‌ పరిధిలో శ్రీనివాస కల్యాణం మండపంలో ప్రజా గాయకుడు గద్దర్‌కు బహుజన, దళిత, ప్రజా సంఘాలు సంయుక్తంగా నివాళి అర్పిస్తూ సంస్మరణ సభ నిర్వహించాయి. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు కంట వేణు, ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగ సంఘ నాయకులు నూతలపాటి భరత్‌ భూషణ్‌ రాజు, బిఎస్‌పి నాయకులు బొచ్చ బుద్ధుడు, కార్మిక సంఘ నాయకులు దావాలా రమణారావు, ఎంపిపి బొమ్మలి సుధాకర్‌, నిర్వాహకులు బత్తిన మోహన్‌, గురుబిల్లి రవికుమార్‌, పొట్నూరు రమేష్‌ , తదితరులు పాల్గొన్నారు. జానపద గేయకారుడు పాటల తూట ఉదయ భాస్కర్‌ గేయాలు ఆలపించగా ఆధ్యాంతం సభ ఘనంగా జరిగింది.