Oct 02,2023 20:44

సాలూరు: గాంధీ విగ్రహానికి పూలమాలవేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

జాతి పితి మహాత్మాగాంధీ జయంతత్సోవాలు జిల్లాలో సోమవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటాలకు, విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
సాలూరు: మహాత్మా గాంధీ ఆశయాలకు టిడిపి సహా జనసేన పార్టీలు తూట్లు పొడుస్తున్నాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్ధాపనే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్‌లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ, తహశీల్దార్‌ బాలమురళీకృష్ణ, టౌన్‌ సిఐ సిహెచ్‌ శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ ప్రయోగ మూర్తి పాల్గొన్నారు.

పార్వతీపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మున్సిపల్‌ చైర్పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్‌ ఇండుపూరు గున్నేష్‌, పలువురు కౌన్సిల్‌ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకష్ణ, ఫ్లోర్‌ మంత్రి రవికుమార్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ గొర్లి మాధవరావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, వైసిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: చింతల గూడ వీధి ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల మేనేజర్‌ బేత కృష్ణమూర్తి నాయుడు సోమవారం స్థానిక పాఠశాలలో గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఆరిక రవికుమార్‌, పాఠశాల పూర్వ ఎస్‌ఎంసి చైర్మన్‌ అనుపోజు వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు: తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి సిపిఎం నాయకులు సిపిఎం పట్టణ నాయకులు టి.రాముడు, టి.శంకర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి.ఇందు, భారతి పాల్గొన్నారు.
కొమరాడ: గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోటిపాము సర్పంచ్‌ ఎస్‌ సుగుణ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు హేమా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌: మండలంలోని ఖరసూవలస ఎంపియుపి పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి మండల యుటిఎఫ్‌ గౌరవ అధ్యక్షులు సింగారాపు సింహాచలం పూలమాల వేసి నివాళులర్పించారు.
వీరఘట్టం: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సోమవారం బొడ్లపాడు గ్రామంలో ఎంఇఒ ఆర్‌ ఆనందరావు గాంధీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. దశమంతపురంలో విద్యార్థులు గాంధీ విగ్రహానికి పూలమాలు వేశారు. చిట్టిపూడివలసలో ఉపాధ్యాయులు సాకేటి రాంబాబు, విద్యార్థులు, నడుకూరులో జనసేన నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరి, రాంబాబు, జనసేన జానీ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : గాంధీజి 154 జయంతిని పురస్కరించుకొని గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ అధ్యక్షులు విష్ణు, వైస్‌ ఎంపిపి నిమ్మక శేఖర్‌, సర్పంచి బి గౌరీ శంకర్‌ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేదారిపురం గ్రామంలో సర్పంచి టి. తులసమ్మ, రాయగడ జమ్ములో సర్పంచి పత్తిక అమల, ఎల్విన్‌ పేటలో సర్పంచి ఆర్‌ చైతన్య స్రవంతి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. రెల్ల, మండ, పి. ఆమిటి, బాలేసు, దుడ్డుఖల్లు, చెముడు గూడ, జర్న, వనకబడి గోయిపాక, చాపరాయిబిన్నిడి, తాడి కొండ, లంబేసు, కుక్కిడి, ఇరిడి తదితర పంచాయతీల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా మండల జర్నలిస్టులు ఎల్విన్‌ పేటలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గత నాలుగున్నర ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని, అక్రిడేషన్‌ల జారీ అరకొరకగా జరిగిందని, హెల్త్‌ కార్డులు పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని సమస్యలన్ని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ జర్నలిస్టులు సరిపల్లి శ్రీనివాసరావు, కంచర్ల రామారావు, మద్ది నాని, గంట పెంటయ్య, పైడా కొండలరావు, పాలక ప్రేమానంద్‌, ప్రకాష్‌ రావు, శ్రీనివాసరావు ఉన్నారు.
ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు పెంచాలి
పచ్చదనం పెంచేందుకు ప్రతి పౌరుడు బాధ్యత తీసుకుని మొక్కలు పెంచాలని డుమ్మంగి సర్పంచ్‌ పాలక క్రాంతికుమార్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమం చేప్పట్టారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి నాగరాజు, క్షేత్ర సహాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పాచిపెంట : స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి బి. ప్రమీల ఆధ్వర్యంలో సోమవారం గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట వీరం నాయుడు. ఎంపిటిసి దండి ఏడుకొండలు, పద్మాపురం సర్పంచ్‌ బి వీరయ్య, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌: మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి మజ్జి శోభారాణి, ఎంపిడిఒ రమణమూర్తితో కలసి బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకంపేట పంచాయితీ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి సర్పంచ్‌ తీళ్లకృష్ణారావు, వైఎస్‌ ఎంపిపి సిద్ధా జగన్నాధరావు, చిన బొండపల్లిలో సర్పంచ్‌ గండి శంకరరావులు నివాళులు అర్పించారు. గంగాపురం, నరిశిపురం, ములగ, తదితర పంచాయితీ కార్యాలయాలలో ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ సిబ్బంది, క్షేత్రసహాయకులు అద్వర్యంలో గ్రామసభలు నిర్వహించి గ్రామంలో పనులు గుర్తించారు.
బలిజిపేట: మండలంలోని పెదపెంకిలో సోమవారం గాంధీ సెంటర్‌లో గాంధీ జయంతిని గాంధీ విగ్రహ నిర్మాత స్వర్గీయ గుళ్లిపల్లి అప్పలస్వామి నాయుడు, సాధు తాతయ్య కుమారుడు గుళ్లిపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.
సీతానగరం: మండలంలోని లచ్చిపేట, గాదెలవలస, నిడగల్లులో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, వేణుగోపాలనాయుడు పూలదండలు వేసి నివాళులర్పించారు. అలాగే జనసేన నాయకులు గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళ్లు అర్పించారు. స్థానిక గాంధీ విగ్రహానికి పెద్ద భోగి సర్పంచ్‌ జొన్నాడ తేరేజమ్మ, ఆర్యవైశ్య సంఘం నాయకులు మమ్మల్ని విశ్వేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే చెల్లంనాయుడువలస ఎంపిఇపి స్కూల్‌ ఆవరణంలో హెచ్‌ఎం విజయకుమారి ఆధ్యర్యంలో విశ్రాంత హెచ్‌ఎం దాసరి పరశురాము మాస్టర్‌ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, గ్రామ సచివాలయం కన్వీనర్‌ దాసరి నాగరత్నం, గృహసారధులు, గ్రామవాలంటీర్లు మహాత్మాగాంధీ విగ్రహంకి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
పాలకొండ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మీసాల సూర్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. సంస్కృత ఉపాధ్యాయులు బౌరోతు శంకరరావు, తెలుగు ఉపాధ్యాయులు దన్నాన నారాయణరావు, కార్యాలయ సిబ్బంది అనూష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని పి.లేవిడిలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ట్రైబల్‌ రైట్స్‌ ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఐ.రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీలకంఠాపురం, గుమ్మ, వేగులవాడ, లేవిడి గ్రామాల సర్పంచులు అడ్డాకులు మన్మధరావు, ఆరిక గోపాలరావు, భుజంగరావు, వెంకట్రావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలో సచివాలయాల్లో, పాఠశాలల్లో సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, సచివాలయ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణ పై ర్యాలీ
సాలూరు: వన్యప్రాణుల సంరక్షణ అందరి సామాజిక బాధ్యత అని అటవీ రేంజ్‌ అధికారి కె.రామారావు అన్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా నీడ్‌ స్వచ్ఛంద సంస్థ, అటవీ రేంజ్‌ కార్యాలయం సిబ్బంది సంయుక్తంగా స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి బోసుబొమ్మ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే వన్యప్రాణుల సంరక్షణ అవసరమని నీడ్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పి.వేణుగోపాల్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ సిఐ శ్రీనివాసరావు, అటవీ రేంజ్‌ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
మహాత్ముని విగ్రహ ప్రతిష్ట
గరుగుబిల్లి : మండలంలోని తోటపల్లి - నందివానివలస మార్గంలో కొత్తగా నిర్మించిన జట్టు ట్రస్ట్‌ కార్యాలయంలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎపి గాంధీ స్మారక నిధి కన్వీనర్‌ డాక్టర్‌ డి.పారినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు, తేజో సంస్థ వ్యవస్థాపకులు పిఎస్‌ ప్రకాశరావు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ సేవకు విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్‌ సేవలను అభినందించారు. జట్టు ట్రస్ట్‌ భవన్‌లో కొత్తగా నిర్మిస్తున్న అతిథి గృహానికి రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో తోటపల్లి ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ మర్రాపు సత్యనారాయణ, శ్రీరామ చంద్రమూర్తి, డాక్టర్‌ ఎం.గోపీనాథ్‌, సరోజ్‌ ప్రహరాజ్‌, ఎం.వాసు దేవరావు, సిబ్బంది పాల్గొన్నారు.